భారత్‌కు గట్టి పోటీనిస్తాం: జోన్స్

78చూసినవారు
భారత్‌కు గట్టి పోటీనిస్తాం: జోన్స్
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ అమెరికా కీలక పోరులో తలపడనుంది. ఈ క్రమంలో అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత జట్టుకు గట్టి పోటీనిస్తాం. నిర్భయంగా ఆడేస్తాం. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే విజయాలు సాధించగలిగాం’ అని పేర్కొన్నారు. భారత జట్టులో ప్రతి ప్లేయరూ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తారు. బౌలింగ్‌లో మాత్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని చెబుతా అని అన్నారు.

సంబంధిత పోస్ట్