తెలంగాణలో పథకాలకు లబ్దిదారుల ఎంపికలో రాజకీయాలకు తావులేదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దశలవారీగా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు, రేషన్ కార్డు ఇస్తాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా ₹12 వేలు అందజేస్తాం. పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకోనివారికి, దరఖాస్తు చేసుకున్నా పేరు రానివారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం' అని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ (D) భూత్పూర్ (M) కప్పెట గ్రామ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.