డిసెంబర్ నెలాఖరు కల్లా 4 వేల స్టోర్లును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. "ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచాలని నిర్ణయించాం. డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లూ ఒకేసారి ప్రారంభించనున్నాం. మా వినియోగదారులకు మరింత చేరువకావడమే దీని లక్ష్యం." అని భవీశ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.