పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తాం: మంత్రి

54చూసినవారు
పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తాం: మంత్రి
చట్టం నుంచి పేర్ని నాని తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పేదల బియ్యం తినేసి ఇప్పుడు ఆయన నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. "భార్య పేరుతో గిడ్డంగి ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా? ఆమె పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటు. చోరీ చేసి డబ్బు తిరిగిచ్చేస్తే దొర అయిపోరు. పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తాం. అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తాం." అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్