ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన రోస్టర్ విధానంలోనే పొరపాట్లు జరిగాయని అభ్యర్థులు తొలి నుంచి లేవనెత్తుతున్నారు. రోస్టర్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ మార్చే వరకు గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్-2 ప్రరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది.