జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ప్రతిరోజూ వేర్వేరు రంగుల్లో దుస్తులు ధరిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. సోమవారం తెల్లని వస్త్రాలు ధరించాలి. తెలుపు, పసుపు, వెండి, లేత బూడిద లేదా నీలం రంగుల్లో దుస్తులు ధరించవచ్చు. మంగళవారం ఎరుపు రంగు ధరించండి. బుధవారం ఆకుపచ్చ రంగులో దుస్తులు ధరించండి. గురువారం పసుపు, నారింజ దుస్తులు ధరిస్తే అంతా సర్దుకుపోతుంది. శుక్రవారం రోజున నీలం లేదా తెలుపు దుస్తులు ధరిస్తే మంచిది. శనివారం నలుపు, బూడిద, ఊదా రంగు దుస్తులను ధరించండి.