ఏపీలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలుచేస్తున్నామని తెలిపారు. తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నానని.. ఆ నొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరుకాలేదని పవన్ స్పష్టం చేశారు. అయినా కూడా తన బాధ్యతలు నిబద్ధతతో నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.