ఒడ్డున పడి కొట్టుకుంటున్న చేపను ఈ కొంగ ఏం చేసిందంటే(వీడియో)

55చూసినవారు
నదిలో, చెరువులలో కొంగలు వేటకు వెళ్ళినపుడు చేపలు కనపడితే వాటిని ముక్కుతో పట్టేసి లటుక్కున నోట్లో వేసుకుంటాయి. అయితే దీనికి భిన్నంగా ఓ కొంగ ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైరలవుతున్న వీడియోలో ఓ చేప చెరువు ఒడ్డున పడి కొట్టుమిట్టాడుతుంటుంది. అక్కడే ఉన్న కొంగ చేపను గమనించి మెల్లగా చేప వద్దకు వచ్చి నోటితో పట్టుకుంటుంది. అయితే మింగేస్తుందేమో అనుకునే సరికి.. చెరువు వద్దకు వెళ్ళి మళ్లీ నీటిలో పడేస్తుంది. ఈ వీడియో తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్