ఇండియా కూటమి సంక్షోభంపై మల్లికార్జున ఖర్గే ఏమన్నారంటే?

68చూసినవారు
ఇండియా కూటమి సంక్షోభంపై మల్లికార్జున ఖర్గే ఏమన్నారంటే?
ఇండియా కూటమిలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆయన మీడియాలో మాట్లాడారు. కూటమి నుంచి జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వైదొలగడం పట్ల తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. భాగస్వామ్య పార్టీలన్నింటినీ ఏకంగా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో చర్చలు జరుపుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్