పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. నిన్న యెమెన్‌లోని అల్ హొదైదా పోర్టును సమూలంగా ఇజ్రాయెల్ ధ్వంసం చేయడంతో.. ఇవాళ హౌతీ తిరుగుబాటు దారులు ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. కానీ, ఐడీఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండి మార్గం మధ్యలోనే దానిని కూల్చివేశాయి. తమ దేశ గగనతలం బయటే యారో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దీనిని గుర్తించి కూల్చివేసినట్లు పేర్కొంది.