వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి?

2976చూసినవారు
వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి?
చేతుల నుంచి రక్తాన్ని తీసి ముఖంపై ఇంజెక్ట్ చేయడమే వాంపైర్ ఫేషియల్. ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా మైక్రోనెడ్లింగ్ అని కూడా దీనిని పిలుస్తారు.
తొలుత రోగి నుంచి రక్తాన్ని తీసి ప్లేట్‌లెట్ అధికంగా ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. చిన్న సూదితో గుచ్చుతూ ఆ ప్లాస్మాను తిరిగి ముఖంలోకి చొప్పిస్తారు. ఈ ప్లేట్‌లెట్స్ కొత్త చర్మ కణాలు, కొల్లాజెన్‌ల పెరుగుదలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. దీని ద్వారా ముడతలు, మచ్చలు తగ్గుతాయి.

సంబంధిత పోస్ట్