అసలు ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏంటి?

67చూసినవారు
అసలు ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏంటి?
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా అని పిలువబడే భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ నుండి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా భూభాగం అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ, యూదులు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అయితే..యూదుల కోసం పాలస్తీనాను ‘జాతీయ నివాసం’గా ఏర్పాటు చేయాలని బ్రిటన్‌ని అంతర్జాతీయ సమాజం కోరింది. ఇదే పాలస్తీనియన్లు, యూదుల మధ్య వివాదానికి బీజం వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్