‘శ్రీశైలం ప్రసాదంలో కనిపించినవి ఎముకలు కావు’

563చూసినవారు
‘శ్రీశైలం ప్రసాదంలో కనిపించినవి ఎముకలు కావు’
శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక వచ్చినట్లు ఓ భక్తుడు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవమని ఆలయ ప్రధాన అర్చకులు మారండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణ శర్మ తెలిపారు. పాకశాలలో తయారు చేసే ప్రసాదం శుచీశుభ్రతతో తయారు చేస్తారన్నారు. పులిహోరలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదన్నారు. ఈ ఘటన తమకు ఎంతో మనోవేదనకు గురిచేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్