నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం అవుతుంది?

84చూసినవారు
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం అవుతుంది?
భారతదేశంలో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయని మీరు అనుకుంటే పొరపాటే. భారతదేశంలో ఎన్నికలను తిరస్కరించే హక్కు నోటాకు లేదు. ఉదహారణకు లక్ష ఓట్లతో నోటా మొదట స్థానంలో నిలిచి.. 99,999 ఓట్లతో అభ్యర్థి రెండో స్థానంలో నిలిస్తే.. అతడినే విజేతగా ప్రకటిస్తారు. నోటాకు వేసే ఓట్లను రద్దు చేసిన ఓట్ల కేటగిరీలో ఉంచుతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందుకే భారత్‌లో నోటాకు పడిన ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపవు.

సంబంధిత పోస్ట్