అల్లు అర్జున్ అరెస్టుపై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ ఘటన బాధాకరం. భద్రతాపరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరు. జాగ్రత్తగా ఉండాలని మాత్రమే వాళ్లు చుట్టు పక్కల వారికి సూచిస్తుంటారు. ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయం’’ అని పేర్కొన్నారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.