ప్రధాని మోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏకధాటిగా 98 నిమిషాల పాటు మాట్లాడి, 2016లో తాను చేసిన అత్యంత సుదీర్ఘ ప్రసంగాన్ని (96 నిమిషాలు) అధిగమించారు. 1997లో మాజీ పీఎం ఐకే గుజ్రాల్ చేసిన 71 నిమిషాల ప్రసంగం కూడా అతి సుదీర్ఘ ప్రసంగాల్లో ఒకటి. కాగా, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ వరుసగా 1954, 1966లో అతి తక్కువ (14 నిమిషాలు) స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు.