ప్రకృతి సహజ సిద్ధమైన కొన్ని రకాల వస్తువులను తినడం వలన ఆరోగ్యంగా ఉంటామని ఆయుర్వేదం చెబుతోంది. కొన్ని ఆహార పదార్థాలకు ఉన్న అసాధారణ లక్షణాల వల్ల వాటిని ఆయుర్వేదంలో 'అమృతం'గా పరిగణిస్తూ ఉంటారు. పసుపు, తిప్ప తీగ, ఉసిరి, తులసి, ఆవు నెయ్యి, తేనె, అల్లం వంటి పదార్థాలు చేకూర్చే మేలు కారణంగా వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అమృతంగా పిలుస్తారు. ఈ పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల శరీర దోషాలు (వాత, పిత్త, కఫం) సమతుల్యం అవుతాయి.