ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోడీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 69 శాతం ఓట్లతో మోడీ మొదటి స్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫుమియొ కిషిద చివరి స్థానంలో నిలిచారు.