కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం కేసీఆర్‌కు లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. 'ఐదుగురు ఉన్నప్పుడు భట్టి విక్రమార్క అసెంబ్లీకి వచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఎందుకు రావట్లేదు? కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణ ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం, సీఎంలదే తుది నిర్ణయం' అని చెప్పారు.