దేశవ్యాప్తంగా గిరిజనుల మీద జరుగుతున్న దాడులపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లగచర్ల ఘటనపై ఎందుకు నోరు మెదపడంలేదని BRS నాయకురాలు సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. లగచర్ల బాధితులు ఢిల్లీ వరకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నా రాహుల్ గాంధీకి ఎందుకు వినిపించలేదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఊడిగానికి, కడుతున్న కప్పానికి గిరిజనులను బలిపశువులను చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.