ఫిబ్రవరిలో 29వ రోజుని 'అదనపు రోజు' అని ఎందుకు అంటారంటే.?

73చూసినవారు
ఫిబ్రవరిలో 29వ రోజుని 'అదనపు రోజు' అని ఎందుకు అంటారంటే.?
ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఏడాది ఆయుష్షులో అదనంగా మరో రోజు జీవించినట్లే అంటున్నారు.భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.ఇలా ఓ రౌండ్ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. ఈజీగా చెప్పాలంటే 365 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుంది. ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కాబట్టి ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావు రోజులను కలిపి ఒక రోజుగా మార్చి లీప్ ఇయర్ లో ఫిబ్రవరి నెలలో అదనపు రోజును చేర్చుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్