భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఎక్కువగా ఆదివారమే జరుగుతుంటుంది. ఈ రెండు జట్ల మధ్య ఉండే మ్యాచ్‌కు ఎక్కువ క్రేజ్ ఉండటమే ఇందుకు కారణం. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మిగితా అన్ని మ్యాచులకంటే దాయాదీ జట్ల మధ్య మ్యాచ్‌కే ఎక్కువ అభిమానులు వస్తారు. ఆదివారాల్లో టీవీ రేటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఛానల్స్‌కు కూడా లాభం చేకూరుతుంది. క్రికెట్ బోర్డులకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. తద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.