సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెంటనే స్పందించి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పిందని, ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం బాగుందని తెలిపారు. ఊపిరితిత్తుల్లో కాస్త ఇన్‌ఫెక్షన్ ఉందని, అది క్లియర్ అవ్వడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.