యంగ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి కలిసి జంటగా నటించిన మూవీ మనమే. ఈ మూవీ గతేడాదిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కామెడీ, డ్రామా, ఎమోషన్స్‌తో పక్కా పర్పెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం శర్వా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.