మోదీకి గుడి కట్టిస్తా: మమతా బెనర్జీ

84చూసినవారు
మోదీకి గుడి కట్టిస్తా: మమతా బెనర్జీ
ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ ప్రయోజనం కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘దేవుళ్లు రాజకీయాలు చేయరు. అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయరు. మోదీజీ.. మీకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తా. ప్రసాదంగా డోక్లా పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండి’ అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్