ఆవిర్భావ వేడుకలకు.. కేసీఆర్ వ‌స్తారా..?

68చూసినవారు
ఆవిర్భావ వేడుకలకు.. కేసీఆర్ వ‌స్తారా..?
జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సాధనకు కారకులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వాన పత్రాలను ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా రేవంత్ స‌ర్కార్ ఆహ్వాన ప‌త్రికను పంపాల‌నుకుంటోంది. అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ హాజరయ్యేందుకు స‌ముఖంగా లేన‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్