తనపై విమర్శలు చేసిన మాజీ సీఎం కేసీఆర్పై శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ‘నా పేరు వాడి అసత్యాలు మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ ఆస్తుల చిట్టా బయటపెడతాం. ఆయనకు నిజాం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. దోచుకున్న ఆస్తులను ప్రజలకు పంచుతాం. నాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపిస్తా. రేపు ప్రెస్మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని కోమటిరెడ్డి తెలిపారు.