కర్ణాటకలోని దమ్మితిమర్రి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వీరు శ్రీ సత్యసాయి జిల్లాలోని రొద్దం మండలం రెడ్డిపల్లికి చెందిన చరణ్(18), తిరుమలేశ్(20)గా గుర్తించారు. మరో యువకుడు భరత్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.