యూపీలోని బరేలీ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. డబ్బు కోసం సవతి తల్లి కూతురినే అమ్మేసింది. బాలిక తల్లి మరణించడంతో తండ్రి ఇంకొ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అతను మరణించడంతో సవతి తల్లి ఇదే అదనుగా కూతురిని గ్రామంలోని ఓ యువకుడికి అమ్మేసింది. ఈ క్రమంలో యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అతడి నుంచి తప్పించుకొని సోదరి వద్దకు చేరుకొని విషయాన్ని చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.