సజీవంగా కాలిపోయిన మహిళ.. షాకింగ్ వీడియో

69చూసినవారు
న్యూయార్క్ సిటీలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు ఆగంతకుడు నిప్పంటించడంతో ఆమె సజీవంగా కాలి మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. న్యూయార్క్ సిటీ సబ్‌వేలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దుండగుడు ఘటనా స్థలంలోనే ఉండి ప్రశాంతంగా బెంచ్‌పై కూర్చొని బాధితురాలు కాలిపోతున్న దృశ్యాన్ని చూస్తున్నాడు. నిందితుడు ఎందుకు ఆమెకు నిప్పంటించాడో తెలియరాలేదు. ఈ ఘటన అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్