పాము కాటుతో విద్యార్థిని మృతి

72చూసినవారు
పాము కాటుతో విద్యార్థిని మృతి
AP: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) ఇంటి వరండాలో కూర్చొని ఉంది. కుర్చీ కింద పాము రావడాన్ని గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటు వేసింది. దాంతో మౌనికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. కూతురి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటర్ చదువుతోంది.

సంబంధిత పోస్ట్