ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఓ మహిళా వ్యాపారి రెచ్చిపోయింది. వినియోగదారుడిని దుర్భాషలాడుతూ కత్తితో బెదిరించింది. ఈ ఘటన ఎయిర్పోర్ట్ రోడ్ మెట్రో స్టేషన్ సమీపంలోని మార్కెట్లో చోటుచేసుకుంది. అనుమతులు లేకపోయినా అక్కడ కొందరు తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి.. మహిళా వ్యాపారికి గొడవ ప్రారంభమైంది. ఆ వ్యక్తి అక్కడ జరిగిందంతా రికార్డు చేసి పోలీసులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.