మహిళా ఆవిష్కర్తలు పెరగాలి: ఎన్వీ రమణ

60చూసినవారు
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి: ఎన్వీ రమణ
మన దేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 2019-21 మధ్య కాలంలో దాఖలైన పేటెంట్ దరఖాస్తుల్లో మహిళల వాటా 10.2శాతం మాత్రమేనని గుర్తుచేశారు. ‘ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. మహిళలు సహజసిద్ధమైన పరిశోధకులని ఏనాడో నిర్ధారణ అయింది. మహిళలను విస్మరించిన ఏ రంగంలోనూ ఆశించిన రీతిలో పురోగతి సాధ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్