మహిళల ఆసియా కప్ షెడ్యూల్ విడుదల

79చూసినవారు
మహిళల ఆసియా కప్ షెడ్యూల్ విడుదల
మహిళల ఆసియా కప్-2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్, గ్రూపు-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్ లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల్లో టాప్-2గా నిలిచిన జట్లు సెమీస్ చేరనున్నాయి. జులై 19న పాక్, 21న UAE, 23న నేపాల్ జట్లతో భారత్ తలపడనుంది. 26న సెమీఫైనల్, 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్