ఒక్క సారి సాగు చేస్తే ఏటా రూ.లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే పంటల్లో సీతాఫలం ఒకటి. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లోనూ దీనిని సాగు చేయవచ్చు. అలాగే సీతాఫలం పండు గుజ్జును ఐస్ క్రీం, పాల ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు. గింజల నుంచి రసం తీసి దానిని పెయింట్ పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. మంచిగా మార్కెటింగ్ చేసుకోగలిగితే వీటి ద్వారా ఏటా రూ.లక్షల్లో ఆదాయం పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.