పరమశివుని మహా మృత్యుంజయ స్వరూపం అత్యంత శక్తివంతమైనదిగా చాలామంది భావిస్తారు. సోమవారం ప్రదోష వేళ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ శివలింగాన్ని ఆవు నేతి, తేనె, గంగాజలంతో అభిషేకిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. శివుని మహా మృత్యుంజయ రూపాన్ని ఆరాధిస్తే.. నయం కాని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. మృత్యు భయం తగ్గుతుంది. అంతేకాదు శివుని మహా మృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలం, ఆత్మబలం కూడా చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.