డబ్ల్యూపీఎల్-3 ఫైనల్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ముంబై మరోసారి కప్పు కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 149/7 స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ ఈ సమయంలోనూ కోలుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ 20 ఓవర్లలో 141/9 స్కోరు మాత్రమే చేసి 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.