తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ ‘మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’కు ఎంపికయ్యారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు బాషా నిలయం ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాదికి గాను అందెశ్రీని ఎంపిక చేసింది. మరోవైపు తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి డా.యాకూబ్ ఎంపికయ్యారు.