యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో సోమవారం శ్రీ తిరుమలనాథ స్వామి పెయింటర్స్ అసోసియేషన్ యూనియన్ మండల అధ్యక్షులు బొర్రా వెంకటేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పెయింటర్స్ కు సంబంధించిన పలు సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం 2025 నూతన క్యాలెండర్ ను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.