అర్ధరాత్రి మేకపోతు చోరీ

1567చూసినవారు
భువనగిరి మండలం బాలంపల్లి గ్రామంలో మేకల పెంపకదారుడు కాశపాక రామచంద్రయ్య తన మేకపోతును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ఆదివారం తెలిపాడు. గ్రామంలో అర్ధరాత్రి ఇంటి పక్కన ఉన్న దొడ్లో కట్టివేసిన మేకపోతును గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారన్నారు. అదే సమయంలో మెలుకువ వచ్చి కారును వెంబడించగా రాయగిరి వైపు తప్పించుకుపోయారన్నారు.

సంబంధిత పోస్ట్