రాజాపేట ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కే హరిత దేవి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం ఎంఈఎఫ్ రాజాపేట మండల కన్వీనర్ ఇంజ మహేష్ మాదిగ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఖలీల్ జూనియర్ అసిస్టెంట్ అంకురి విజయ్, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు రామ్ గొల్ల శ్రీనివాస్ మాదిగ, పి సమ్మయ్య మాదిగ, కార్యాలయ సిబ్బంది కవిత మంగమ్మ పాల్గొన్నారు.