ఆలేరు నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్, కారొబార్ ల సమస్యలు పరిష్కరించాలని మోటకొండూరు మండల కారొబార్, బిల్ కలెక్టర్ లు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ని కోరారు. ఆదివారం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ని కలిశారు. వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కారొబార్, బిల్ కలెక్టర్ లకు ప్రత్యేక హోదా కల్పించి అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి గా నియమించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.