ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళి

153చూసినవారు
ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం మాదిగ అమరవీరులకు నివాళి అర్పించారు. కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఇన్ ఛార్జి క్యాసగాళ్ల రమేష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు సంగి సామి మాదిగ హాజరై మాట్లాడుతూ దండోరా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ రుణపడి ఉంటుందని అన్నారు. అమరవీరుల ఆశయాలను సాధించడమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు గ్యాదపాక మల్లేష్ మాదిగ. అందే సుధాకర్. బైరా పాక సురేష్. రవి. ముద్ద బాకా శీను. కత్తి బాలరాజు. సిద్ధులు. కొనపురం నరేందర్. గంధ మల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్