కడుపునొప్పి తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(యం) మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శ్యామల వెంకటమ్మ భర్త యాకయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఉద్యోగరీత్యా వేరే గ్రామంలో స్థిరపడ్డాడు. వెంకటమ్మ ఒక్కతే గ్రామంలో ఉంటోంది. ఆమెకు గత సంవత్సరం నుండి ఒళ్ళు మండుట మరియు కడుపునొప్పి ఉండడంతో హాస్పిటల్ లో చూపించిన బాగాకాలేదు. సోమవారం రాత్రి కడుపునొప్పి తీవ్రం అవడంతో తన ఇంటి ముందు గల టేకు చెట్టుకు చీరతో ఉరి వేసుకొని చనిపోయినది. మంగళవారం ఉదయం పాలు పోయడానికి వచ్చిన తిమ్మాపురం గ్రామస్థుడు కోల మచ్యగిరి చూసి, మృతురాలి కొడుకు శ్యామల బాబుకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపినాడు. మృతురాలి కొడుకు శ్యామల బాబు పిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఏ ఎస్సై అంజయ్య తెలిపారు.