తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో భాస్కరరావు కొండ కింద స్వామివారి పాదాల చెంత హారతి ఇచ్చి గిరి ప్రదక్షణ కార్యక్రమం ప్రారంభించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి వారి ఆలయ ముఖ మండపం నందు అష్టోత్తర శతకటాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.