భువనగిరి మండలం హనుమపురం గ్రామ అఖిలపక్షాల నాయకులు శుక్రవారం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓ తో చర్చ జరిపారు. మంచినీటి సమస్యలు ముఖ్యంగా గ్రామంలో వర్షాకాల నేపథ్యంలో సరిగ్గా పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడంతో విషసర్పాల బారిన పడే అవకాశం ఉందన్నారు. వీధి దీపాల ఏర్పాటు చేయాలని వెంటనే దోమల మందును పిచికారి చేయాలన్నారు. సమస్యలను పూర్తిగా తొలగించాలన్నారు.