యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వేసవికాలంలోని నీటి కొరత తెలుసుకొని బత్తుల విప్లవ కుమార్ గౌడ్ చౌటుప్పల్ పట్టణ ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని తన సొంత నిధులతో తన భూమిలో బోరు వేయించారు. పట్టణ ప్రజల అవసరాల కొరకు బోరును మున్సిపాలిటీ కమిషనర్ కు సోమవారం అప్పగించారు. పట్టణ ప్రజల అవసరాలు తెలుసుకుని ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బత్తుల విప్లవ కుమార్ గౌడ్ ని అభినందించారు.