మొబైల్ యాప్ సర్వే ప్రక్రియను భువనగిరిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలిసి సందర్శించి, పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వివరాలను సేకరించి, ఆన్లైన్ లో అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.