భువనగిరి: ఘనంగా స్వర్ణ గిరి బ్రహ్మోత్సవాలు

52చూసినవారు
యాదాద్రి జిల్లా స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శ్రీవారు కల్పవృక్ష వాహనం మీద కొలువుదీరి ఆలయ తిరుమాడ వీధులలో విహారిస్తూ భక్తుల కోరిన కోర్కెలను అనుగ్రహిస్తున్నారు. భీమవరం గోవింద పీఠం పీఠాధిపతి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి విచ్చేసి స్వామివారిని దర్శించి తమ దివ్య మంగళశాసనములను అనుగ్రహించారు. సింహాచలం శ్రీ వరాహ నరసింహ స్వామి వారి పట్టు వస్త్రాలను శేష మాల చందనమును సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్