మా గ్రామాన్ని రక్షించండి మహాప్రభో అని 133 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న కొండమడుగు గ్రామ ప్రజలు

2292చూసినవారు
మా గ్రామాన్ని రక్షించండి మహాప్రభో అని 133 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్న కొండమడుగు గ్రామ ప్రజలు
యాదాద్రిభువనగిరి జిల్లా, బీబీనగర్ మండలము కొండమడుగు గ్రామంలో గల కాలుష్యకారక రసాయన పరిశ్రమలను గ్రామం నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ. , గ్రామపజల రిలే నిరాహార దీక్షలు నేటికి 133 రోజులకు చేరింది. కానీ అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తూ. పరిశ్రమల అనుమతి గడువు ముగిసిన కూడా, వారికి బాసటగా నిలవడం శోచనీయం. పొల్యూషన్ బోర్డు నిబందనలు ఉల్లంఘించి , భూగర్భజలాలు పూర్తిగా కలుషితమై, వాయుకాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసినా. అధికారులు సేకరించిన నీటినమూనా03-08-2022 నాటికి ఆస్టర్ ఇండస్ట్రీ పరిశ్రమ ప్రొడక్షన్ ఉత్పత్తికి తాత్కాలిక అనుమతి గడువు ముగిసింది.
కానీ పరిశ్రమ యాజమాన్యం మాత్రం యధావిధిగా నడిపించడం జరుగుతుంది. అధికారుల ఆదేశాల ప్రకారం ప్రొడక్షన్ చేయడానికి వీల్లేదని పొల్యూషన్ బోర్డు అధికారులు మరియు పోలీసు అధికారులు పరిశ్రమ యాజమాన్యంను హెచ్చరించడం జరిగింది. కానీ పరిశ్రమ యాజమాన్యం మాత్రం యధేచ్చగా నడిపించడం, దీనిపై పలుమార్లు అధికారులకు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పరిశ్రమ యాజమాన్యం మాటతో ఏకీభవించి బాయిలర్ నడవడం లేదు, పరిశ్రమలో ఎలాంటి ఉత్పాదన లేదని తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్